Home Page SliderTelanganatelangana,

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనుచరుడి హత్య- ఎమ్మెల్సీ ధర్నా

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరు పొందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) జగిత్యాలలో దారుణ హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఆదివారం ఉదయం సంతోష్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన గంగారెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారు. ఈ హత్యకు నిరసనగా జగిత్యాలలో పాత బస్టాండ్ వద్ద జీవన్ రెడ్డి తన అనుచరులతో ధర్నాకు దిగాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ నాయకులకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక్కడ జగిత్యాలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.