కొమురం భీమ్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీమ్ 84 వ వర్ధంతి సంధర్బంగా ఆదిలాబాద్ పట్టణంలోని కొమురం భీమ్ చౌక్ లో గల ఆయన విగ్రహానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొమురం భీమ్ గారు జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆదివాసీల పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మావల ఎంపీపీ దర్శనాల పవన్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,లోక ప్రవీణ్ రెడ్డి,కౌన్సిలర్ ఆవుల వెంకన్న,పోరెడ్డి కిషన్,యెల్టీ భోజా రెడ్డి,సంద నర్సింగ్,యెల్మెల్వార్ రామ్ కుమార్,ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మకంటి రమేష్, ఉప అధ్యక్షులు బూర్ల శంకరయ్య,నాయకులు పోరెడ్డి కిషన్, ఎం. ఏ షకీల్,బండి దేవి దాస్ చారి తదితరులు పాల్గొన్నారు.


 
							 
							