ఎమ్మెల్సీపై కాంగ్రెస్ నేతల ఫైర్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్నపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికపై విమర్శలు కురిపిస్తూ, దానికి నిప్పు పెట్టిన ఘటనపై మండిపడ్డారు. మంత్రి సీతక్క ఈ విషయంపై మాట్లాడుతూ మల్లన్న కాంగ్రెస్‌లో ఉంటాడో, లేదో డిసైడ్ చేసుకోవాలన్నారు. అతని గెలుపు కోసం కాంగ్రెస్ నేతలంతా ప్రయత్నించామని పేర్కొన్నారు. ఇదే విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వార్నింగ్ ఇస్తూ సమగ్ర కుల గణనపై రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ నియమాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేస్తారని, అందరి అపోహలు తొలగిస్తారని క్లారిటీ ఇచ్చారు.

