Home Page SliderTelangana

బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోంది: కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల వేలం హాట్ టాపిక్‌గా మారింది. బొగ్గు గనుల అమ్మకాలను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏకంగా వేలంలో పాల్గొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర హక్కులు, ఆస్తులు తాకట్టు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని అన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు.