కర్ణాటక ఎన్నికల వేళ కొత్త వివాదంలో కాంగ్రెస్
కర్ణాటక ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్తవివాదంలో తలదూర్చింది. ఎన్నికల కోసం రాజకీయపార్టీలన్నీ మేనిఫెస్టోలు విడుదల చేసే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌ను రద్దు చేస్తామనే హామీ ఉందనే వార్తతో రాష్ట్రవ్యాప్తంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలు మొదలుపెట్టారు. మైసూరులో కాంగ్రెస్ మేనిపెస్టోను తగలబెట్టారు కార్యకర్తలు. అన్ని ఆలయాలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తున్నారు. అయితే ఈ ఆరోపణను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. తమ మేనిఫెస్టోలో అలాంటి అంశం ఏదీలేదని, తాము బజరంగీదళ్‌ను బ్యాన్ చేస్తామని చెప్పలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. కానీ బీజేపీ కార్యకర్తలు వారి ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.