ఏపీలో పూర్తి స్థాయి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, మార్క్ చూపించిన షర్మిల
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని ఖరారు చేసింది. షర్మిల పీసీసీ చీఫ్ కాక ముందు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు, అభ్యర్థుల్ని వెదుక్కునే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి పూర్తి స్థాయిలో అభ్యర్థులు దొరికినట్టుగా కన్పిస్తోంది. అదే సమయంలో ముందుగా ఖరారు చేసిన చాలా మందికి పార్టీ ఈసారి హ్యాండిచ్చినట్టుగా కన్పిస్తోంది. చాలా మంది అభ్యర్థుల్ని మార్చేశారు. మార్పుపై, గతంలో టికెట్లు పొందిన నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నిన్న పార్టీ 9 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.