రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కెమెడీ… నవ్వులు.. పువ్వులు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్లమెంట్‌లో చేసే ప్రసంగాలు ఆసక్తి కలిగిస్తుంటాయి. రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం మధ్య ఆస్కార్ అవార్డుల గురించి ప్రస్తావించారు ఖర్గే. విజేతలకు అభినందనలు తెలుపుతూ ఇది భారతదేశానికి గర్వకారణమని అన్నారు. RRR నుండి ‘నాటు నాటు’ పాటతోపాటుగా… డాక్యుమెంటరీ, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను అభినందించారు. రెండు చిత్రాలు కూడా సౌతిండియా నుంచి వచ్చాయన్నారు. తనకు చాలా గర్వంగా ఉందన్నారు. అయితే అధికార పార్టీ మొత్తం వ్యవహారంపై క్రెడిట్ తీసుకోవద్దంటూ చురకలు వేశారు ఖర్గే. మేం డైరెక్ట్ చేశాం.. మేం పాటలు రాశామంటూ క్రెడిట్ తీసుకోవద్దంటూ సెటైర్లు వేశారు. మోదీజీ డైరెక్ట్ చేశారని మాత్రం చెప్పొద్దన్నారు. ఇది దేశం గొప్ప తనమని శ్లాఘించారు. ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో నవ్వులు పూశాయి. రాజ్యసభ ఛైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో సహా సభ్యులంతా ఖర్గే వ్యాఖ్యలతో నవ్వుకున్నారు.