NationalNewsPolitics

రూటు మార్చిన కాంగ్రెస్..సీట్ల సర్దుబాటుపై రాజీ

ఇటీవల జరిగిన హర్యానా, జమ్ముకాశ్మీర్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పులు దిద్దుకునే ఆలోచన చేస్తోంది. తన రూటు మార్చి మిత్రపక్షాలతో సర్దుబాటు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. రాబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీని ఎదుర్కొనేందుకు మిత్రపక్షాల కూటమితో పరిష్కారం ఆలోచిస్తోంది. అందుకే తక్కువ స్థానాలలో పోటీకి సిద్దపడింది. మహారాష్ట్రలో 288 స్థానాలలో 125 సీట్లు ఆశించినా, చివరకు 110 సీట్లకు అంగీకరించింది. మిత్రపక్షాలైన శివసేన, ఎస్‌పీ, సమాజ్ వాదీ పార్టీలతో సీట్ల విషయంలో చర్చలు జరుపుతోంది.