జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ విజయం
హర్యానాలోని జులనా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. బీజేపీకి చెందిన మాజీ ఒలంపియన్ కెప్టెన్ యోగేష్ బైరాగి, ఆర్మీ మాజీ ఆఫీసర్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మాజీ రెజ్లర్ కవితా దలాల్‌పై వినేష్ ఫోగట్ 6 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సంవత్సరం ఒలింపిక్ హార్ట్‌బ్రేక్‌ను చవిచూసిన ఫోగట్, సెప్టెంబర్ 6న కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని గంటల్లోనే ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది. “నేను కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభిస్తున్నాను. కాలం కష్టాల్లో ఉన్నప్పుడే తమతో ఎవరు నిలబడతారో తెలుస్తుంది. మమ్మల్ని రోడ్లపైకి ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలు మాతో పాటు ఉండి మా బాధను అర్థం చేసుకున్నాయి.” అన్నారు.
