Home Page SliderTelangana

పెండింగ్ బిల్లుల కోసం సిద్దిపేట కలెక్టరేట్ ముందు సర్పంచ్‌ల ఆందోళనలు

తెలంగాణాలో సర్పంచుల ఫోరం అధ్వర్యంలో పార్టీల కతీతంగా ధర్నా చేస్తున్నారు రాష్ట్రంలోని సర్పంచులు. సిద్దిపేట కలెక్టరేట్ ముందు ఆందోళనలు మొదలుపెట్టారు. చాలా బిల్లులు పెండింగులో ఉన్నాయని, చాలాకాలంగా ప్రభుత్వానికి దరకాస్తులు పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. బిల్లులు పాస్ కాక గ్రామాలలో పనులు జరగడంలేదని, సర్పంచులను కీలుబొమ్మల్లాగ వాడుకుంటున్నారని వాపోతున్నారు. పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా ఈ ధర్నాలు చేస్తున్నామని ఏ పార్టీ వాళ్లైనా సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వాలని, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరుతున్నారు.