Home Page SliderTelangana

‘సీఐ’ పెంపుడు కుక్కలపై కాలనీవాసుల పంచాయితీ

ఎల్బీనగర్ మంజీరా హైట్స్‌లో పెంపుడుకుక్కల కారణంగా అపార్ట్ మెంట్స్ వాసులు మీడియాలో పెద్ద పంచాయితీనే పెట్టారు. ఈ మధ్య కాలంలో కుక్కల కారణంగా చిన్న పిల్లలు చనిపోవడం, చాలా మందిపై కుక్కలు దాడి చేయడం వంటి సంఘటనలు జరిగాయి. దీనితో ప్రజలు కుక్కలంటేనే భయపడుతున్నారు. ఇక్కడ కుక్కలను పెంచుకుంటున్న వ్యక్తి పోలీస్ వ్యక్తి కావడంతో అపార్ట్‌మెంట్ వాసులను బెదిరిస్తున్నారని కూడా అభియోగం వచ్చింది. ఈయన పెంచుకుంటున్న కుక్కలు చాలా పెద్దవి కావడం, కాస్త భయంకరంగా ఉండడంతో ముగ్గురు వ్యక్తులు వాటిని చూసి, భయపడుతున్నారని కూడా కంప్లైంట్స్ వచ్చాయి.   ఆయన ఈ కుక్కలను మనుషులు తిరిగే లిఫ్ట్‌లోనే తిప్పుతారని, తాడు కట్టకుండా ఫ్రీగా తిరగనిస్తారని అక్కడి వారు చెప్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లో సర్వీస్ లిఫ్ట్ కూడా ఉందని, అది వాడమని సిఐకు నచ్చచెప్పామని, కుక్కలకు బెల్ట్ కట్టడం లేదని  అపార్టమెంట్ ప్రెసిడెంట్  పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లపై స్పందించిన  జీహెచ్‌ఎంసీ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు కూడా వచ్చారు. తన కుక్కలు ఎవరినీ గాయపరచలేదని, ఎవరిపై దాడి చేయవని వాదిస్తున్నారు సీఐ.