ప్రియాంక బుగ్గలపై కామెంట్స్..బీజేపీ నేతకు పనిష్మెంట్
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా ఢిల్లీ రోడ్లను నిర్మిస్తానని కామెంట్స్ చేసిన బీజేపీ నేత రమేశ్ బిధూడీపై పార్టీ అధిష్టానం మండి పడుతోంది. పార్టీ అధినేత జేపీ నడ్డా ఈ విషయంలో ఆయనను మందలించినట్లు తెలుస్తోంది. అంతేకాక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతీశీ ఆమె తండ్రినే మార్చేశారని, తండ్రి ఇంటిపేరును కాకుండా మరో పేరును వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలకు స్త్రీలంటే గౌరవం లేదని మండిపడ్డారు. దీనితో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. అతిశీకి వ్యతిరేకంగా కాల్కాజీ నియోజకవర్గం నుండి ఆయనను తప్పించి, మరో మహిళా నేతను బరిలోకి దింపాలను బీజేపీ ఆలోచిస్తోంది.

