NationalNews

కరెన్సీ నోట్లపై సీఎం సంచలన వ్యాఖ్యలు

Share with

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్ల మీద గాంధీజీ ఫోటో పక్కనే… వినాయకుడు, లక్ష్మీదేవిల బొమ్మలను ముద్రించాలని సూచించారు. ఆఖరికి ఇండోనేషియా వంటి పరాయి దేశాల్లో కూడా కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ముద్రిస్తారని.. మన కరెన్సీపై కూడా లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు ఉంటే దేశం ఇంకా సుసంపన్నమవుతుందని అన్నారు. దీనిపై రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.  మన దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలంటే ఆ దేవతల ఆశీర్వాదం కూడా అవసరమే“ అని వ్యాఖ్యలు చేశారు సీఎం.  ప్రస్తుతం కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

అసలు ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడి బొమ్మ ఎందుకు?

ప్రపంచంలో ఒకే ఒక దేశ కరెన్సీ నోట్లపై వినాయకుడి బొమ్మ ఉంటుంది. ముస్లిం మెజార్టీ ఉన్న ఆ దేశంలో 20,000 రూపాయి నోటుపై గణేశుడి బొమ్మ ఉంటుంది. ఆ దేశంలో 87.5% మంది ఇస్లాంను, 1.7% మంది హిందుత్వాన్ని ఫాలో అవుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. దీంతో అక్కడి ఆర్థిక వేత్తలు ఓ బృందంగా ఏర్పడి చర్చోపచర్చలు చేశారు. బుద్ధికి సంకేతం… వినాయకుడి… అందుకే కరెన్సీపై వినాయకుడి బొమ్మను ముద్రిద్దామని ఆ బృందం డిసైడ్‌ అయినట్లు ఇండోనేషియా స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు.. గతంలో చోళ రాజులు ఇండోనేషియాను పాలించారు. ఇప్పటికీ అక్కడ గణపతిని జ్ఞానం, సైన్స్‌కు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు వారికి మహాభారతం, రామాయణంపై కూడా పట్టు ఉంది.