ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచరాణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. జగదీశ్ రెడ్డి పిటిషన్ విచారణను ముగించింది. కేసును బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. రేవంత్ రెడ్డికి కేసు విషయాలు రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.