Breaking NewscrimeHome Page SliderTelangana

పంచాయితీ ఆఫీస్‌కు సీఎం తండ్రి పేరు

సీఎం రేవంత్ రెడ్డి ప‌రిపాల‌న అంటేనే ఉద్దేశ్య‌పూర్వ‌క వివాదం అనే ఫార్ములాగా మార్చేశారు.రూలింగ్‌లో ప్ర‌తీ అంశాన్ని హీలింగ్ చేసేస్తున్నారు అనే ఆరోప‌ణ‌లు నిత్య‌కృత్య‌మౌతున్నాయి.తన సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్ లో ఫార్మాసిటీ ఏర్పాటుకు భూ సేక‌ర‌ణ‌,జంట న‌గ‌రాల్లో హైడ్రా,రైతుల అరెస్ట్‌,సినీ తార‌ల అరెస్ట్ ఇలా ఒక‌టా రెండా…అస‌లు ప‌రిపాల‌న అంటేనే వివాదం అనేలా మార్చేశారు.తాజాగా త‌న సొంత గ్రామ‌మైన కొండారెడ్డి ప‌ల్లిలో రూ. 2 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మించిన పంచాయితీ కార్యాల‌యానికి త‌న తండ్రి ఎనుముల అనుముల న‌ర్సింహారెడ్డి పేరు పెట్టుకుని మ‌రో కొత్త వివాదానికి తెర‌తీశారు. దీంతో ఈవిష‌యాన్ని బీ.ఆర్‌.ఎస్‌.,బీ.జె.పిలు సోష‌ల్ మీడియా వేదిక‌గా రేవంత్ చ‌ర్య‌ను తూర్పార‌బ‌డుతున్నారు. పంచాయితీ ఆఫీస్ ఏమైనా మీ …అ….జాగీరా అంటూ కేటిఆర్ యూత్ ఫోర్స్ దారుణంగా పోస్ట్ చేస్తే…బీజెపి కూడా తానేమీ త‌క్కువ తినలేద‌న్న‌ట్లుగా మిగిలిన ఆఫీస్‌ల‌కు కొడుకు,కోడ‌ళ్లు..మ‌నుమ‌ళ్ల పేర్లు పెట్టుకోలేక‌పోయారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.