సీఎంఆర్ కాలేజీ వీడియోల ఘటన..యాజమాన్యం కీలక నిర్ణయం..
మేడ్చల్‌లోని కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో లేడీస్ హాస్టల్‌లో రహస్యంగా బాత్‌రూంలో వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ సహా ఇప్పటివరకూ ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనితో కాలేజీ యాజమాన్యం కళాశాలకు 3 రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరోపక్క విద్యార్థినుల ఆందోళనకు మద్దతుగా ఏబీవీపీ, బీజేవైఎం నేతలు మద్దతు తెలిపారు. రాష్ట్రమహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. విద్యార్థి సంఘాలు కూడా వీరికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు.
Breaking news: ఆ వైరస్ వస్తే ఈ సారి అంతా స్మాషే

