దావోస్‌లోనూ పుష్ఫని వదలని సీఎం
యాదృచ్ఛికమో లేదా ఉద్దేశ్యపూర్వకమో తెలీదు గానీ సీఎం రేవంత్ రెడ్డి…సినీ హీరో అల్లు అర్జున్‌ని ఇప్పట్లోవదిలేలా లేడు.తెలంగాణలో పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.అందులో యాంకర్…. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం మంచిది కాదంటూ ఏపి సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత వ్యాఖ్యానించారని తెలిసిందంటూ రేవంత్‌ని ప్రశ్నించారు.దీంతో చిర్రెత్తిపోయిన రేవంత్…అసలు చంద్రబాబుకి పూర్తి వివరాలు తెలీవు అందుకే అలా మాట్లాడి ఉంటాడు.ఆయన అన్నీ విషయాలు తెలుసుకుని మాట్లాడాలి కదా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాటలో మహిళ చనిపోతే, అల్లు అర్జున్ గానీ వాళ్ల కుటుంబీకులు గానీ 10-12 రోజుల వరకు బాధిత ఫ్యామిలీని పట్టించుకోలేదు .అందుకే చట్టం తన పని తాను చేసుకుపోయింది అంటూ వ్యాఖ్యానించారు.