తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం
మొంథా తుఫాన్ దృష్ట్యా అందరూ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు.
“రాత్రికి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటనుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని సీఎం తెలిపారు.
ప్రాణనష్టం పూర్తిగా నివారించేందుకు, ఆస్తి నష్టం తగ్గించేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
“అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరుతాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

