మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్

విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు & ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మరియు ప్రైమరీ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ DSC-2024 విడుదల చేశారు.

