Home Page SliderTelangana

ఎమ్మెల్సీ కవితకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

అసెంబ్లీ శాసనసభ సమావేశాలలో అధికార, విపక్ష పార్టీల మధ్య జోరుగా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. నేటి సభలో మేడిగడ్డ ప్రాజెక్టు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం అట్టహాసంగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు ఎలా కుంగిపోయాయని, అన్నారం పగిలిపోయిందేమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనితో మొత్తం శాసనసభ సభ్యులను ఆ ప్రదేశాలకు తీసుకువెళ్లి చూపిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి ఎమ్మెల్సీ కవిత మీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి కావలసిన విచారణలు చేసుకోవచ్చని బదులిచ్చారు. ఇసుకపై ప్రాజెక్టులు ఎలా కడతారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ మొదలుకొని ఎన్నో ప్రాజెక్టులు కట్టామని, ఇలా కట్టిన మూడేళ్లలోనే ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా ఎలా మారిందని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి, బాధ్యులను తప్పకుండా చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.