“గౌడలపై సీఎం రేవంత్ రెడ్డి తీరు బాధాకరం”:కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణా సీఎం గౌడలను చెట్లపై అంతసేపు నిలబెట్టడం వారిని అవమానించడమే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి గౌడల వృత్తి మీద చౌకబారు జోకులు వేయడం దుర్మార్గమన్నారు.అయితే మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటుందని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కాగా మానవత్వం ఉన్న నాయకుడెవరూ..ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడరని కేటీఆర్ ట్వీట్ చేశారు.
