హోంమంత్రి అమిత్‌షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ మధ్యనే ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి మళ్లీ రాష్ట్రసమస్యలపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. అమిత్‌షాతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించే అవకాశం ఉంది. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.