Home Page SliderNational

కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం ఈ రోజు రాత్రి కేరళ బయల్దేరి వెళ్లనున్నారు. రేపు వయనాడ్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వయనాడ్, అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒక సెగ్మెంట్లో రాజీనామా చేయాలి. దీంతో ఆయన వయనాడ్ లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడి నుంచి రాహుల్ సోదరి ప్రియాంకగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయనుండటంతో సీఎం రేవంత్ వయనాడ్ వెళ్తున్నారు.