ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి సీఎం రేవంత్
ప్రమాదాల నియంత్రణలో ఆర్టీఏ అధికారుల పాత్ర ఎంతో కీలకమైందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.సోమవారం తొలిసారిగా ఆయన ఖైరతాబాద్ విచ్చేశారు.ఇటీవల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లుగా అర్హత సాధించిన వారికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.113 మంది అసిస్టెంట్ ఎంవిఐ లకు నియామక పత్రాలు అందజేశారు.కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న వారందరికీ అభినందనలు తెలిపారు.నాణ్యమైన వాహన చోదకులను తీర్చిదిద్దే బాధ్యత ఎంవిఐలదేనన్నారు.అనంతరం సీఎం రేవంత్‌ని ఆర్టీఏ అధికారులు ఘనంగా సన్మానించారు.

