అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ఫైర్
ప్రతిపక్షం సహనం కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.బీఆర్‌ఎస్ సభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా..స్పీకర్ సహనంతో ఎంతో సంయమనంతో వ్యవహరించారని రేవంత్ కితాబిచ్చారు.భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారని అధికారం, అహంకారంతో.కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారని కేసిఆర్,కేటిఆర్ కుటుంబీకులనుద్దేశించి విమర్శించారు. ఎంతో మంది తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేశారని,కానీ భూములు దోచుకుని తెలంగాణకు ద్రోహం చేసిన వారు ప్రతిపక్షంలో ఉన్నారని ఆరోపించారు. ఫార్ములా – ఈ వ్యవహారం ఇప్పటిది కాదని, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే నలుగుతుందన్నారు.దీనిపై మరింత లోతైన చర్చ జరిపి విచారించాకే ఎఫ్.ఐ.ఆర్ లో నిందితులందరి పేర్లు చేర్చుతారని చెప్పారు.

