Home Page SliderNationalNews Alert

బాలుడికి డెంటల్‌ సర్జరీ చేసిన సీఎం

త్రిపుర సీఎం మాణిక్‌ సాహా డాక్టర్‌గా మారారు. హపానియాలోని త్రిపుర మెడికల్‌ కాలేజీలో 10 ఏళ్ల బాలుడికి డెంటల్‌ సర్జరీ స్వయంగా చేశారు. ఆయనకు పలువురు వైద్యుల టీం సర్జరీలో సహాయం చేశారు. మాణిక్‌ సాహా వృత్తిరీత్యా డెంటల్‌ డాక్టర్‌. సర్జరీ సంబంధించిన ఫోటోలను త్రిపుర సీఎం మాణిక్‌ సాహా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. రాజకీయాల్లోకి రాక పూర్వం ఆయన త్రిపుర మెడికల్‌ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా వైద్య పాఠాలు కూడా బోధించేవారు. 10 ఏళ్ల అక్షిత్‌ ఘోష్‌ అనే బాలుడికి ఓరల్‌ సిస్టిక్‌ లెషన్‌ సర్జరీ నిర్వహించడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా గ్యాప్‌ తర్వాత సర్జరీ చేసిన తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సీఎం ట్వీట్‌ చేశారు. 2022 మేలో త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా అధికారం చేపట్టారు.