మేడ్చల్‌లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.దీంతో రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు,రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈ నెల 18న సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు.కాగా అక్కడ జరగబోయే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. దీంతో ఇవాళ భారీ బహిరంగ సభ స్థలాన్ని మంత్రి మల్లా రెడ్డి,బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.కాగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. అయితే మేడ్చల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు సీఎం కేసీఆర్ సభ కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

