Home Page SliderTelangana

సీఎం కేసీఆర్ మహిళల ఆపద్బాంధవుడు: MLC కవిత

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా ఈ రోజు మహిళా సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని MLC కవిత తెలంగాణా సీఎం కేసీఆర్‌పై ప్రసంశల జల్లు కురిపించారు. దేశంలోని ఏ  రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణాలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. అందుకే రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పథకాలు చక్కగా అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణాలో కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలతో కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దలా,ఆరోగ్య లక్ష్మితో ఆరోగ్య దాతగా,షీ టీమ్‌లతో రక్షకుడిగా మొత్తానికి తెలంగాణాలో మహిళల ఆపద్బాంధవుడిగా కేసీఆర్ అండగా నిలిచారని కవిత కేసీఆర్‌ను కొనియాడారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లతోపాటు అంగన్‌వాడీ,ఆశా కార్యకర్తలకు జీతాలను సీఎం కేసీఆర్ పెంచారని MLC కవిత గుర్తుచేశారు.