ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్
గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతి నిర్మాణానికి వారు చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎస్ మధుసూధనాచారి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.