తెలుగుదేశం పార్టీ మహానాడు హామీలపై సీఎం జగన్ సరికొత్త వ్యూహం
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో 10 నెలల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. వీటిలో భాగంగానే ఇటీవల టీడీపీ తమ మిని మ్యానిఫెస్టోను మహనాడు వేదికగా విడుదల చేసింది. కాగా తెలుగుదేశం ప్రకటించిన మ్యానిఫ్యాస్టో కు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో ప్రకటించిన మానిఫెస్టోలో కనీసం 50 శాతం అంశాలను కూడా ప్రజలకు అందించలేక పోయిందని ఇదే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా అదే తరహాలో తెలుగుదేశం అమలు చేస్తుందని అటువంటి పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరోసారి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆ దిశగా విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులకు పార్టీ అధినేత దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తుంది.

ఆ దిశగానే పార్టీ శ్రేణులు నాయకులు పోరాటానికికు సిద్ధమవుతున్నారు. 2014 తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను 2019 వైఎస్ఆర్‌సీపీ మ్యానిఫెస్టోను ఒక్కసారి పరిశీలించండి అంటూ సీఎం జగన్ గడిచిన ఏడాదికాలంగా ప్రతి బహిరంగ సభలోను ప్రజలకు సూచిస్తూ వస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రజలకు ఇచ్చిన హామీలను సగం కూడా అమలు చేయలేకపోయిందని 2019లో వైఎస్ఆర్‌సీపీ ఇచ్చిన ప్రతి హామీని 98% పైగా అమలు జరిపి చూపించమని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహానాడులో చంద్రబాబు నాయుడు 2024ను ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. మహానాడు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను సీఎం జగన్ పరిశీలించటంతో పాటు 2014 ఎన్నికల్లోను చంద్రబాబు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం అమలు జరిపిన పథకాలు ఇలా అన్ని అంశాలపై సీఎం జగన్ పరిశీలిస్తూ ఆదిశగా సరికొత్త వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.