Andhra PradeshNewsNews Alert

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటి.. వాటిపైనే కీలక చర్చ..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.  ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు సీఎం జగన్.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చించనున్నారు. అలాగే, నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని కోరనున్నారు సీఎం జగన్‌. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను కూడా అమలు చేయాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. ప్రధాని భేటీ తర్వాత వీలును బట్టి కేంద్ర మంత్రులను కూడా కలువనున్నారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లను కూడా సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు.