News Alert

దుర్గమ్మకు ఇవాళ పట్టు వస్త్రాల సమర్పణ

మూలా నక్షత్రం పురస్కరించుకొని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఆదివారం సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మను ఆయన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు. సీఎం రాకను దృష్టిలో ఉంచుకొని అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో అన్ని క్యూల్లో భక్తులను దర్శనానికి అనుమతించబోమని, సీఎం వచ్చి వెళ్లే వరకు నిలుపుదల చేస్తామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీఎం రాక నేపథ్యంలో ఇంటెలిజన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ సిబ్బంది శనివారం ఇంద్రకీలాద్రిపై ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.