Andhra PradeshHome Page Slider

మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌

బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాల దానానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ
గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తరలింపు..
గుండె తరలింపు కోసం హెలికాఫ్టర్‌ ఏర్పాటు
ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన కృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు బ్రెయిన్ డెడ్‌ కాగా.. అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి రాగా వెంటనే స్పందించిన ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్‌ను వారి కోసం ఏర్పాటు చేయించారు. చనిపోయిన వ్యక్తి గుండెను ఆ హెలికాఫ్టర్‌లో తిరుపతిలో పద్మావతి ఆసుపత్రికి తరలించారు. సీఎం జగన్‌ వెంటనే స్పందించి తీసుకున్న చొరవను అందరూ అభినందిస్తున్నారు.

అవయవాల తరలింపు కోసం గ్రీన్‌ ఛానల్‌..

గుంటూరుకు చెందిన కృష్ణ(19) యువకుడు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అతను చనిపోయినట్లు గుంటూరు పట్టణంలోని రమేష్‌ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ క్రమంలో మృతి చెందిన యువకుడి గుండెను తిరుపతి లోని శ్రీ పద్మావతి చిల్డ్రన్న్స్ హార్ట్ కేర్ హాస్పిటల్‌కు తరలించారు. దీనికోసం ప్రభుత్వం గ్రీన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు హెలికాప్టరు ఏర్పాటు చేయడంతో వెంటనే మృతుని గుండెను తిరుపతికి హుటాహుటిన తీసుకెళ్లారు. ఇక విశాఖపట్ననికి లివర్, గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు కిడ్నీలను తరలించారు. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్‌ను తిరుపతి పద్మావతి ఆసుపత్రి వైద్యులు చేస్తున్నారు.