Home Page SlidermoviesTelanganatelangana,

ఫిలిం ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి కండిషన్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రితో చర్చలు కొనసాగించారు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు. రెండు గంటల పాటు జరిగిన ఈ చర్చలలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. అయితే వీరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లుతో పాటు పలు కండిషన్స్ ఖరారు చేశారు, వారికి ఎలాంటి మినహాయింపులూ లేవంటూ లక్ష్మణ రేఖ గీశారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు దిల్ రాజు, నాగార్జున, వెంకటేశ్, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా ఇండస్ట్రీ నడుచుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచే  అవకాశం లేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయంలో ఖచ్చితంగా ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం పేర్కొన్నారు. బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటామని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రెటీలదే అని తేల్చి చెప్పారు.  కులగణన సర్వే, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను సినీ ప్రముఖులు ప్రచారం చేసి, ప్రోత్సహించాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపై సినీ ఇండస్ట్రీ అండగా ఉండాలన్నారు. అలాగే డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటామని, సినీ వర్గాలు ఎవరైనా డ్రగ్స్ కేసులో పట్టుబడితే మినహాయింపులు ఉండవన్నారు. రాజకీయాలను, సినిమాలను కలిపి చూడవద్దని, తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు.