CM-చంద్రబాబు, హోంమంత్రి అనిత నాకు న్యాయం చేయండి: జెత్వానీ
AP: కుక్కల విద్యాసాగర్ – YCP పార్టీ నేతకు చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు. అందుకే ఆయనను ఆ పార్టీ దూరంగా ఉంచినట్లు కూడా తెలిపారు. 2015లో విద్యాసాగర్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినా నేను తిరస్కరించా. దీంతో నాపై దొంగ అనే ముద్రవేసి కేసు పెట్టారు. ఈ కేసులో నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించిన పోలీసులను కూడా శిక్షించాలి. CM చంద్రబాబు గారు, హోంమంత్రి అనిత నాకు న్యాయం చేయాలి అని ఆమె అభ్యర్థించారు.

