గొంగడి త్రిషకు భారీ నజరానా
అండర్ -19 టీ 20 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులోని కీలక ప్లేయర్ గొంగడి త్రిషకు భారీ నజరానా లభించింది. వరల్డ్ కప్ పూర్తి చేసుకుని కప్‌తో తిరిగివచ్చిన టీమ్‌కు ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ఆమెను అభినందించి, ఆశీర్వదించిన సీఎం త్రిషకు కోటి రూపాయల రివార్డు ప్రకటించారు. ఈ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిందని మెచ్చుకున్నారు.