Andhra PradeshNews

పేదల ఇళ్ల స్థలాలకు లైన్ క్లియర్

◆ అమరావతి రాజధాని లో 900.97 ఎకరాల పంపిణీకి రంగం సిద్ధం
◆ సి ఆర్ డి ఏ నోటిఫికేషన్ జారీ

ఏపీలోని అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. రాజధాని యేతర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు కూడా అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇంతకు ముందు నిర్ణయించింది. దీనిపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో పేదల ఇండ్ల స్థలాలకు అప్పట్లో బ్రేక్ పడింది. తాజాగా సీఆర్డీఏ భూవినియోగంలో మార్పులు చేస్తూ మంగళగిరి మండలం నిడమర్రు , కురగల్లు తుళ్లూరు మండలం మందడం,ఐనవోలు గ్రామాల్లో భూమినియోగంలో మార్పులు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రతిపాదనలపై వ్యక్తులు స్థానిక సంస్థలకు అభ్యంతరాలు ఉన్న ప్రభావితం అవుతుందని భావించిన 15 రోజుల్లోగా అభ్యంతరాలను సమర్పించేందుకు గడువు ఇచ్చింది. వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సీఆర్డిఏ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీసీఆర్డీఏ అధికారిగా వెబ్సైట్ లో పొందుపరిచారు.

ప్రణాళిక విభాగంలో కూడా అందుబాటులో ఉంచారు. రాజధాని నగర అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కన్సార్టియం 27 జోన్లుగా వర్గీకరించింది. ఇందులో రవాణా విద్య వైద్యం వాణిజ్యం రక్షణ పాలన వ్యవహారాలు నివాసాలు అంతర్గత రహదారులు ఇలా జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే గత కొద్దిరోజుల క్రితం సి ఆర్ డి ఏ చట్టంలో సవరణలను శాసనసభ ఆమోదించింది. పేదల నివాస స్థలాల విషయంలో హైకోర్టు కూడా స్పందించడంతో మార్గం సుగమమైంది. అమరావతి ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలకు సంబంధించి సీఆర్డిఏ చట్టంతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ చట్టాల కూడా ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఈ ప్రకారం రాజధాని ప్రాంతంలో అమలు చేసే కార్యక్రమాల విషయంలో స్థానిక సంస్థల పాలకవర్గాలకు అవిలేని చోట ప్రత్యేక అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాల స్వీకరించి అమలు చేసెందుకు మార్గం సగమం అయింది.గతంలో పర్యావరణ పట్టణీకరణ ప్రాంతీయ విద్యా వాణిజ్య సముదాయాలకు నిర్దేశించిన జోన్లలో భూములు పేదలకు పంపిణీ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.