Home Page SliderNationalNews Alert

గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి

రాజ్ కోట్ లోని శ్రీ అమృత్ లాల్ విర్ చంద్ జసాని విద్యామందిర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందింది. మంగళవారం ఉదయం విద్యార్థిని రియా సోనీ అస్వస్థతకు గురయ్యారు. ఆమె కోలుకోవడానికి ఆమె తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమె చేతులను, కాళ్ళను రుద్దారు. ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే.. ఆమె మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డీపీఈవో ఆదేశాల మేరకు పాఠశాల సమయాన్ని మార్చి ఉంటే.. ఆమె చనిపోయేది కాదని, చలిని తట్టుకోలేకనే తమ కుమార్తె ప్రాణాలు విడిచిందని.. చలిలో పిల్లలను రక్షించేందుకు యాజమాన్యం సూచించిన స్వెట్టర్లు సరిపోవని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. మరోవైపు తమ కుమార్తె ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి వ్యాధితో బాధపడలేదని రియా తల్లిదండ్రులు తెలిపారు. చలి తీవ్రత కారణంగానే రియా మరణించిందని ఇప్పుడే చెప్పలేమని, తీవ్రమైన గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని డీపీఈవో బీఎస్ కైలా తెలిపారు. ఆమె రక్త నమూనాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ కూడా వైస్రా పరీక్ష నిర్వహిస్తుందని, ఆ తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుందన్నారు.