మంత్రుల మధ్య కొట్లాట..
బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ల విషయంలో వారిలో వారికి కొట్లాటలు మొదలయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లోపించిందని, అంతర్యుద్ధం మొదలయ్యిందని పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ బయటపడతాయన్నారు. కొందరు కరెక్టుగానే ఉన్నా, చాలామంది అవినీతికి పాల్పడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ముగ్గురు మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారని, ఈ కమిషన్లు ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. అల్లు అర్జున్‌కి, రేవంత్ రెడ్డికి ఈ కమిషన్ విషయంలోనే చెడిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించాడో, ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.