Home Page SlidermoviesNationalNews Alertviral

శ్రీలీల ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ..

టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శ్రీలీల తన ‘బిగ్ డే’ అంటూ మంగళస్నానాల ఫోటోలు షేర్ చేయడమే. కొందరు స్త్రీలు శ్రీలీలకు పసుపు పూసి, అక్షింతలు వేసిన ఈ ఫోటోలు చూసిన అభిమానులు శ్రీలీలకు ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందంటూ రూమర్స్ లేపారు. ఇటీవల బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వారి ఫ్యామిలీ ఫంక్షన్‌లో కూడా శ్రీలీల పాల్గొనడంతో  వారి నిశ్చితార్థం జరిగిందని అభిమానులు చెప్తున్నారు. మరికొందరు శ్రీలీల ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం తీసిన వీడియో అంటున్నారు. అయితే ఆమె తిథుల ప్రకారం పుట్టినరోజు చేసుకుందని, అందుకే సంప్రదాయంగా మంగళస్నానాలు చేసిందని భావిస్తున్నారు.