‘సమోసా మిస్సింగ్’పై సీఐడీ ఎంక్వైరీ
ముఖ్యమంత్రి కోసం తెచ్చిన సమోసాల మిస్సింగ్‌పై సీఐడీ ఎంక్వైరీ జరగిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ కోసం ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెచ్చిన సమోసాలు ఆయనకు చేరలేదు. ఈవిషయంలో కంగారు పడిన సీఐడీ చీఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ ఘటన అక్టోబర్ 21న జరిగితే ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభానికి వెళ్లారు. సీఎం కోసం కేకులు, సమోసాలు తెప్పించాలని ఐజీ ఒక ఎస్సైకి చెప్పగా, ఆయన కానిస్టేబుల్‌తో కలిసి సిమ్లాలోని రాడిసన్ బ్లూ హోటల్ నుండి కేకులు, సమోసాలు తీసుకువచ్చారు. వాటిని ఒక విభాగానికి పంపగా, వాటిని ఎవరికోసం తెప్పించారో తెలియక భద్రతా సిబ్బందికి వడ్డించేశారు. సీఎంకు మర్యాదలు చేయలేకపోయామనే బాధతో ఎంక్వైరీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఈ సమోసాలపై ఎంక్వైరీలేంటని, బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.