Andhra PradeshHome Page Slider

పోసాని రిలీజ్‌కు సీఐడీ బ్రేక్

పోసాని కృష్ణమురళికి కేసుల బెడద తప్పడం లేదు. ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టవుతున్నారు. తాజాగా సీఐడీ ఆయన రిలీజ్‌కు బ్రేక్ వేసింది. అన్ని కేసులలో బెయిల్ లభించి, నేడు విడుదల కాబోతున్న పోసానిపై 5 నెలల క్రితం నమోదయిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టిన కేసును తెరపైకి తెచ్చారు. ఈ ఉదయం గుంటూరు కోర్టులో పీటీ వారంట్ దాఖలు చేసిన సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. జైలు నుండే వర్చువల్‌గా ఆయనను జడ్జి ఎదుట ప్రవేశపెడతారని సమాచారం. ఇప్పటికే నమోదయిన అన్ని కేసులలోనూ ఆయనకు బెయిల్ లభించింది.