అన్నమయ్య విగ్రహానికి క్రిస్మస్ టోపీ
పరమ పవిత్రమైన తిరుమలలో ఘోర అపచారం జరిగిపోయింది.గుర్తు తెలియని దుండగులు కలిగియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తిస్వరూపులైన సంకీర్తనామృతాచార్యులు అన్నమయ్య దివ్యమూర్తికి శాంటాక్లాజ్ ( క్రిస్మస్) టోపిని పెట్టారు.ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. ఇంత ఘాతుకానికి పాల్పడిన వ్యవహారంపై టిటిడి అధికార సిబ్బంది ఆలస్యంగా మేల్కొండం అనేది భద్రతా వైఫల్యానికి తార్కాణంగా మారిందని చెప్పాలి. ఇంత జరగుతున్నా…ఇన్నివేల కెమేరాలున్నా ఎందుకు గమనించలేదంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహిస్తూ బజరంగదళ్ , హిందూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.