తమ్ముడి స్పీచ్‌కు ఫిదా అయిన చిరు..
ఏపీలోని పిఠాపురంలో శుక్రవారం జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ స్పీచ్‌కు అభిమానులతో పాటు పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘మై డియర్ బ్రదర్ పవన్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కు ఫిదా అయ్యాను. ప్రజల కష్టాలు తీర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం పెరిగింది. నీ జైత్రయాత్ర కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా..జన సైనికులందరికీ నా శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ పెట్టారు.

