Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి

ఏపీ సీఎంగా రేపు నారా చంద్రబాబు నాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ,అమిత్‌షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు చిరంజీవికి స్టేట్ గెస్ట్‌గా ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు సాయంత్రమే చిరంజీవి విజయవాడకు చేరుకోనున్నారు.అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ స్వయంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.