NewsPoliticsSpiritualTelangana

కిషన్‌ రెడ్డి పాదయాత్ర.. హారతులతో స్వాగతం..

Share with

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల గురించే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని స్థానికులు మంత్రికి వివరించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీడివిజన్‌లలో పాదయాత్ర కొనసాగింది. బస్తీల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలిస్తూ ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. మధ్యాహ్నం బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి వివరిస్తామని కిషన్ తెలిపారు.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోనూ పాదయాత్ర నిర్వహించారు. స్థానిక అధికారులతో సమావేశమై పాదయాత్ర ఉద్దేశాన్ని వివరించి పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని వివిధ కాలనీల్లో కొనసాగింది. వివిధ శాఖల అధికారులను వెంటబెట్టుకుని వాడవాడ తిరిగారు. ప్రజల సమస్యలను వింటూ వినతులను స్వీకరిస్తూ పరిష్కారామే లక్ష్యంగా అధికారులకు అదేశాలిస్తూ సాగారు. ఈ రోజు ఉదయం 8గం లకు బన్సీలాల్ పేట పద్మారావు నగర్ లో హమాలి బస్తీలో ప్రారంభమై వెంకట పురం మేకల మండి మీదుగా మధ్యాహ్నం రాంగోపాల్ పేటకు చేరుకుంది.