జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం అందించారు. విశ్వంభర షూటింగ్ లో ఉన్న చిరంజీవిని పవన్ కల్యాణ్, నాగబాబు పార్టీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జనసేన విజయాన్ని ఆకాంక్షిస్తూ చిరంజీవి, ఆ పార్టీకి విరాళం అందించారు. చిరంజీవి పాదాలకు పవన్ కల్యాణ్ మొక్కగా, నీకు అండగా నేనున్నానన్న భరోసాను చిరంజీవి అందించారు. ఇప్పటి వరకు జనసేన పార్టీకి నైతిక మద్దతిస్తున్న చిరంజీవి, వచ్చే రోజుల్లో పార్టీకి ప్రచారం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన అభ్యర్థుల నియోజకవర్గాల్లో చిరు ప్రచారం చేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్ ను గెలిపించాల్సిందిగా చిరు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.

