Home Page SliderInternationalNews AlertPoliticsviral

మోదీపై చైనా ప్రశంసల వర్షం

చైనా తన రూట్ మార్చింది..హఠాత్తుగా భారతప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో భారత్-చైనా సంబంధాలపై మోదీ సానుకూలంగా మాట్లాడడమే దానికి కారణం. భారత్-చైనాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పడంపై చైనా అధికార ప్రతినిధి మోవో నింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాల కోసం భారత్‌తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. గతేడాది జరిగిన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీ వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మోదీ మాట్లాడుతూ భారత్- చైనాల మధ్య వైరుద్ధ్యాల పరిష్కారానికి చర్చలే పరిష్కారమని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంట 2020 ముందునాటి పరిస్థితులను నెలకొల్పడానికి రెండుదేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.