అప్పులిచ్చి.. దేశాలను దోచేసుకుంటున్న చైనా… మొన్న శ్రీలంక నేడు పాకిస్తాన్, నేపాల్
చైనా అప్పులపై ఇండియాను అలర్ట్ చేసిన అమెరికా
చైనా అప్పులు తీసుకోవద్దంటూ దేశాలకు పిలుపు
ఒకసారి చైనాకు చిక్కితే అంతే సంగతులని హెచ్చరిక
నిండా మునిగాక కూడా అప్పులు ఎర వేస్తున్న డ్రాగన్
భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌కు ఇస్తున్న రుణాల ద్వారా ఆయా దేశాలను బ్లాక్ మెయిలింగ్ కోసం చైనా ఉపయోగించవచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాకు సమీపంలో ఉన్న దేశాలకు చైనా రుణాలిచ్చి… కండిషన్లు పెట్టి.. తిరిగివ్వకుంటే ఆదేశాలు పెను ప్రమాదంలో పడిపోతాయని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా సహాయ మంత్రి డొనాల్డ్ లూ హెచ్చరించారు. ఈ విషయంపై ఇండియాను సంప్రదిస్తున్నట్టు ఆయన చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియా దేశాలు సొంత నిర్ణయాలు తీసుకోవాలని, బయటి భాగస్వామి బలవంతం చేయకూడదన్నది అమెరికా విధానమన్నారు. ఈ మొత్తం వ్యవహారమై… ఇండియాతో మాట్లాడున్నామన్నారు.

ఆయా దేశాలు సొంత నిర్ణయాలు తీసుకోడానికి ఎలా సహాయపడాలన్నదానిపై ఇండియాతో కలిసి పనిచేస్తామన్నారు అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్ లు. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి తమకు 700 మిలియన్ డాలర్ల క్రెడిట్ సదుపాయానికి ఆమోదం లభించినట్టు ప్రకటించిన మరుసటి రోజే… అమెరికా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తున్నాయి. చైనా విషయమై భారత్, అమెరికాల మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని లూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిఘా బెలూన్‌పై వ్యవహారమై… చైనా విషయంలో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇక ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాతో ఏర్పాటు చేసిన క్వాడ్ సైనిక కూటమి కాదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, క్వాడ్ అనేది ఏ ఒక్క దేశానికి లేదా దేశాల సమూహానికి వ్యతిరేకంగా ఉండే సంస్థ కాదన్నారు. క్వాడ్ అనేది ఇండో-పసిఫిక్ దేశాల వాణిజ్యానికి సంబంధించిందన్నారు.

ఇక రష్యాతో భారత్‌కు ఉన్న సైనిక సంబంధాల గురించి అడిగినప్పుడు… ప్రపంచ వ్యాప్తంగా రష్యా సైనిక ఒప్పందాల కోసం తీసుకున్న ఆర్డర్లను నెరవేర్చడంలో ఇబ్బందిపడుతున్నారు. రష్యా, ఇప్పటికిప్పుడు ఇండియాకు కావాల్సిన రక్షణ ఉత్పత్తలను అందించగలదా అన్న అనుమానం ఇండియాకు కూడా కలుగుతోందంది అమెరికా. యుద్ధం వద్దని శాంతి ముద్దని మొదట్నుంచి రష్యాకు ఇండియా చెబుతూ వచ్చిందన్నారు అమెరికా సహాయ మంత్రి. ఇది యుద్ధ యగం కాదని గత ఆగస్టులోనే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని ఆయన అన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించి, ఉక్రెయిన్‌ను బెదిరించాలని చూడటం ఆమోదయోగ్యం కాదని ఇండియా ఇప్పటికే చెప్పిందని అమెరికా మంత్రి అన్నారు.

