HealthHome Page Slider

ఆ నీళ్లు త్రాగుతున్నారా..? అయితే పిల్లలు పుట్టరు..

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కారణంగా మానవాళి చాలా రకాల సమస్యలను ఎదుర్కుంటుంది. అయితే తాజాగా వచ్చిన నివేదికలు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ప్లాస్టిక్ కారణంగా మనిషికి ఆ సామర్థ్యం తగ్గిపోతుందని వెల్లడించింది. కొత్తగా మహిళల్లో పిల్లలు పుట్టకపోవడానికి ప్లాస్టిక్ కే కారణమంటున్నారు నిపుణులు. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తున్నాం. ఏది తినాలన్నా, ఏ పని చేయాలన్నా ప్లాస్టిక్ లేకుండా కుదరదు. ప్లేట్లు, టీ గ్లాసులు, నీళ్ల గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు.. ఇలా అన్నింట్లో ప్లాస్టిక్ వాడుతున్నారు.

అయితే ఈ ప్లాస్టిక్ వాడకం ద్వారా ప్రస్తుతం చాలా మంది సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెళ్లయి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టడం లేదని ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్లాస్టిక్ వాడడం వల్ల అందులో ఉండే విషపూరిత రసాయనాలు శరీరంలోకి చేరి.. రీప్రొడక్షన్ సిస్టమ్ ను పాడు చేస్తాయి. రసాయనాల వల్ల హార్మోన్ వ్యవస్థ దెబ్బతింటుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవల్స్లో తేడాలు వచ్చే ప్రమాదముంది. దీంతో రాను రాను ప్లాస్టిక్ వాడకం వల్ల పిల్లలు పుట్టకపోవడానికి నానో ప్లాస్టిక్స్ కారణం.

నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగ నిరోధక శక్తని సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.